top of page
DharmaSankalpam.png

వాట్ ఇస్ ది ధర్మ సంకల్పం ? 

Black White Yellow Simple Initial Name Logo.png

 ధర్మసంకల్పం గురించిన విశేషం

📿 Dharma Rakshana is our Sankalpam!

వైద్య విద్య తెలియని వ్యక్తి శస్త్రచికిత్స చేసినట్టు, వేదజ్ఞానం తెలియని వ్యక్తి పూజ చేస్తే, అది ధర్మపరంగా హానికరం అవుతుంది.” "ఒకవేళ పూజ శాస్త్రబద్ధంగా జరగదని తెలుసుకొని కూడా మీరు చేయించుకుంటే – ఫలితాలు ఆశించకండి."

వాట్ ఇస్ ది ధర్మ సంకల్పం ?
మీరు సంకల్పించిన ప్రతి పూజా కార్యక్రమాన్ని ధర్మ బద్ధంగా శాస్ర్త పద్దతిగా వేద ప్రమాణముగా కేవలం సంవత్సరములు తరబడి వేదాన్ని అధ్యయనం చేసిన బ్రాహ్మణోత్తములచే వేద మంత్రాల ద్వార పూజని నిర్వహించడమే ఈ ధర్మ సంకల్పం

మీరు కచ్ఛితముగా తెలుసుకోవలసినది

ఈ కాలములో ఎవరు పడితే వాళ్ళు పూజలు చెయ్యడం ప్రారంభించారు ఈ కాలంలో బ్రతకడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, అన్నిటిలో అతి సులభమైన మార్గం పురోహితం అని తెలుసుకున్న చాలామంది, బ్రాహ్మణ వేషధారణ కట్టి వంటి నిండ బొట్లు పెట్టుకుని, పురోహితములో బేసిక్ ఇన్ఫర్మేషన్, భక్తులను పట్టుకునేటువంటి లాజిక్స్ ని తెలుసుకొని, జనాలకు మీకు ఆ దోషం ఉన్నది ఈ దోషం ఉన్నది అని అనేక మైనటువంటి మాటలు చెప్పి జనాలని భయభ్రాంతులను చేసి ఒక దోష నివారణ పూజకి లక్షలు లక్షలు మాట్లాడుకొని పూజలు చెయ్యిస్తాము అని వొప్పుకొని, నలుగురు వేద బ్రాహ్మణులని మాట్లాడుకొని ఒక పూజ కి 2000 లేదా 3000 ఇలా ఇస్తున్నారు వెళ్లిన ఆ వేద పండితులకి జీవిత ఆధారం పురోహితమే కాబట్టి తప్పని పరిస్థితిలో వెళ్లవాల్సివొస్తుంది.

ఇలా చేయడంలో తప్పు లేదు అనుకుందాం

ప్రతి ఒక్కరూ పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, వ్రతాలు,హోమాలు యాగాలు,ఇలా ఎన్నో అద్భుతమైన హిందూ సాoప్రదాములో ఉన్న పూజలు ఇంట్లో చేయించుకునేది, వారికి ఉన్న దోషం పోయి అంతా శుభము జరగాలని లేదా భగవంతుని మీద భక్తి తో దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అలా చేసిన పూజా ఫలితం ఎలా వస్తుంది అంటే మీరు మాట్లాడుకున్నటువంటి బ్రాహ్మణుని మీద ఆధారపడి ఉంటుంది చదువుకున్నవాడు పూజ నిర్వహిస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది.

ఇది మేము చెప్పినటువంటిది కాదు శాస్త్ర ప్రమాణం

శ్లో || దైవాదీనాం జగత్సర్వం మంత్రాదీనంతు దైవతం        తన్మత్రం బ్రాహ్మణో దైవ బ్రాహ్మణో మమ దైవత

ఈ జగత్తు మొత్తం దేవుడు ఆధీనంలో ఉంటే,
దేవుడు  మంత్ర ఆధీనంలో ఉంటాడు,
కానీ మంత్రం మాత్రం బ్రాహ్మణుడి ఆధీనంలో ఉంటుంది, కాబట్టి వేద మంత్రాన్ని అధ్యయనం చేసిన బ్రాహ్మణుడే మనకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు,

ఇది శాస్తప్రమాణం మీరు పూజ చేసిన తర్వాత ఇచ్చే సంభావన కేవలం బ్రాహ్మణులకే వెళ్ళాలి అనేది మా ఆవేదన అలాగే ఈ బ్రాహ్మణుడి తపన కూడ

ఇట్లు
ఆగమ శాస్త పండితులు
దరూరి విష్ణు వర్ధనాచార్యులు
జై శ్రీమన్నారాయణ 

ధర్మాన్ని ఆచరించడం అనేది యుగాలుగా భారతీయ జీవన విధానంలో ఓ కాంతిమంతమైన సత్యం.
 
ఇప్పుడు నైతికత కలుగజేసే ఆచారాలకంటే — డబ్బు కోసం చేసే డబ్బా పూజలు ఎక్కువైపోయాయి.
 
ధర్మసంకల్పం – ఆ పవిత్రమైన ఆచారాలను మళ్లీ మన జీవితాల్లోకి తెచ్చే ప్రయత్నం.
 
ఇక్కడ ప్రతి పూజ:
✔️ శాస్త్రపూర్వకంగా
✔️ సాంప్రదాయబద్ధంగా
✔️ భక్తిపూరితంగా
✔️ నిష్కళ్మషంగా
 
ఇది కేవలం ఓ సేవ కాదు —  
**ఇది పునఃప్రతిష్ఠయైన సత్యం. ఇది ధర్మపథం.**

పూజ అనేది హోరాహోరీగా డబ్బు తీసుకొని, నాలుగు దీపాలు వెలిగించి ముగించే కార్యక్రమం కాదు.

 

అది భగవంతుని పాదాలకు సమర్పించే ధర్మసంపాదన.

 

ధర్మసంకల్పం లో ప్రతి పూజ...  శాస్త్ర ప్రమాణాలతో  

సంప్రదాయపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా  

విధిగా, విశ్వాసంగా జరుగుతుంది.

 

**ఇది కేవలం హోమం కాదు —  

ఇది ఒక హృదయ హారతి.**

bottom of page