మీ పూజా సంకల్పం - మా యొక్క బాధ్యత

ధర్మ సంకల్పం గురించి సమాచారం

వాట్ ఈస్ ది ధర్మ సంకల్పం ?

మీరు సంకల్పించిన ప్రతి పూజా కార్యక్రమాన్ని ధర్మ బద్ధంగా శాస్ర్త పద్దతిగా వేద ప్రమాణముగా కేవలం సంవత్సరములు తరబడి వేదాన్ని అధ్యయనం చేసిన బ్రాహ్మణోత్తములచే వేద మంత్రాల ద్వార పూజని నిర్వహించడమే

ఈ ధర్మ సంకల్పం

మీరు ఖచ్ఛితముగా తెలుసుకోవలసినది

ఈ కాలములో ఎవరు పడితే వాళ్ళు పూజలు చెయ్యడం ప్రారంభించారు

ఈ కాలంలో బ్రతకడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, అన్నిటిలో అతి సులభమైన మార్గం పురోహితం అని తెలుసుకున్న చాలామంది, బ్రాహ్మణ వేషధారణ కట్టి వంటి నిండ బొట్లు పెట్టుకుని,

పురోహితములో బేసిక్ ఇన్ఫర్మేషన్, భక్తులను పట్టుకునేటువంటి లాజిక్స్ ని తెలుసుకొని,

జనాలకు మీకు ఆ దోషం ఉన్నది ఈ దోషం ఉన్నది అని అనేక మైనటువంటి మాటలు చెప్పి జనాలని భయభ్రాంతులను చేసి ఒక దోష నివారణ పూజకి లక్షలు లక్షలు మాట్లాడుకొని పూజలు చెయ్యిస్తాము అని ఒప్పుకొని,

నలుగురు వేద బ్రాహ్మణులని మాట్లాడుకొని ఒక పూజ కి 2000 లేదా 3000 ఇలా ఇస్తున్నారు వెళ్లిన ఆ వేద పండితులకి జీవిత ఆధారం పురోహితమే కాబట్టి తప్పని పరిస్థితిలో వెళ్లాల్సివొస్తుంది.

ఇలా చేయడంలో తప్పు లేదు అనుకుందాం

ప్రతి ఒక్కరూ పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, వ్రతాలు,హోమాలు యాగాలు,ఇలా ఎన్నో అద్భుతమైన హిందూ సాంప్రదాయంలో ఉన్న పూజలు ఇంట్లో పూజ చేయించుకునేది,

వారికి ఉన్న దోషం పోయి అంతా శుభము జరగాలని లేదా భగవంతుని మీద భక్తి తో దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు

అలా చేసిన పూజా ఫలితం ఎలా వస్తుంది అంటే

మీరు మాట్లాడుకున్నటువంటి బ్రాహ్మణుని మీద ఆధారపడి ఉంటుంది చదువుకున్నవాడు పూజ నిర్వహిస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఇది మేము చెప్పినటువంటిది కాదు శాస్త్ర ప్రమాణం

శ్లో’’ దైవాదీనం జగత్సర్వంమంత్రాదీనంతు దైవతం

తన్మత్రం బ్రాహ్మణా దీనం బ్రాహ్మణో మమ దైవత

ఈ జగత్తు మొత్తం దేవుడు ఆధీనంలో ఉంటే,

దేవుడు మాత్రం మంత్ర ఆధీనంలో ఉంటాడు,

కానీ మంత్రం మాత్రం బ్రాహ్మణుడి ఆధీనంలో ఉంటుంది కాబట్టి వేద మంత్రాన్ని అధ్యయనం చేసిన బ్రాహ్మణుడే మీకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు, ఇది శాస్తప్రమాణం

మీరు పూజ చేసిన తర్వాత ఇచ్చే సంభావన కేవలం బ్రాహ్మణులకే వెళ్ళాలి అనేది మా ఆవేదన అలాగే ఈ బ్రాహ్మణుడి తపన కూడ

ఇట్లు

ఆగమ శాస్త్ర పండితులు

దరూరి విష్ణు వర్ధనాచార్యులు

జై శ్రీమన్నారాయణ